హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక లైంగికదాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఉమర్‌ఖాన్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మైనర్ బాలుడిని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. అక్కడ పార్టీ చేసుకున్న అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన నిందితులు కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.