జవహర్‌నగర్, జనవరి 2: తండ్రి మందలించాడనే కోపంతో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ కథనం ప్రకారం యాప్రాల్‌లోని మణిఎన్క్లేవ్లో ప్రాంతంలో సుర్జీవ్కుమార్ మజ్హి కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారు. సుర్జీవ్ కుమార్ మజ్హి చిన్న కుమారుడు బ్రిజేశ్‌కుమార్ మజ్హి(15) బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు.
కొంత కాలంగా కుమారుడి వ్యవహారశైలిలో మార్పు రావడంతో తండ్రి మందలించాడు. దీంతో బ్రిజేశ్‌కుమార్ మజ్హి తన బాబాయ్ కుమారుడైన ప్రిన్స్ మాజ్హి (15) వెంట పెట్టుకుని ఇంట్లోని బీరువాలో ఉన్న రూ. 17,500లను తీసుకుని సోమవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వారి ఆచూకీ కోసం వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.