సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పుష్పక్ బస్సులో కుటుంబ సమేతంగా ఆయన మాసబ్‌ట్యాంక్ వరకు ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులతో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సజ్జనార్ సూచించారు.