సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 2 రోజులు నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. సాయంత్రం నగరంలో చా లా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.