సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బ్యాంకును అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ తరహాలో భూ నిర్వాసితులకు సాయమందించేలా హెచ్ఎండీఏ పరిధిలోనూ ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ డిజిటలైజ్ టీడీఆర్, లెడ్జర్ వంటి సదుపాయాలతో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్లాట్ఫారంను రూపొందించారు.
హెచ్ఎండీఏ టీడీఆర్ ద్వారా భూసేకరణలో ఆస్తులను కోల్పోయిన బాధితులకు పారదర్శకంగా పరిహారాన్ని పొందేలా, క్రయవిక్రయాలకు వీలుగా టీడీఆర్ ఆన్లైన్ పోర్టల్ తయారు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కోల్పోయిన స్థలానికి మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు టీడీఆర్లూ పొందే వీలు ఉంటుందని, భూ నిర్వాసితులు క్రయవిక్రయాలు జరుపుకొనేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఇక హెచ్ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్లన్నింటినీ వెబ్సైట్లో పొందుపరచనున్నారు.