సికింద్రాబాద్, అక్టోబర్ 16: నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీస్ స్టేషన్‌ను శిక్షణలోని ఐపీఎస్ అధికారులు శనివారం సందర్శించారు. పలు అంశాలపై సీఐ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ నుంచి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వరకు నిర్వర్తించే విధులను ఆయన ట్రైనీ ఐపీఎస్‌లకు వివరించారు. అంతేకాక ఎఫ్ఐఆర్ నమోదు, నిందితుల రిమాండ్, చార్జిషీట్ దాఖలు, కేసుల దర్యాప్తుతోపాటు విధుల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై నార్త్‌జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్వార్ వారికి సవివరంగా వివరించారు. కార్యక్రమంలో మహంకాళి ఏసీపీ రమేశ్, కార్ఖానా డీఐ నేతాజీతోపాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.