భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6 నుంచి 11 వరకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు.
సిటీబ్యూరో: దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6 నుంచి 11 వరకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. మదీనా, ముర్గీ చౌక్, అలీబండ-చార్మినార్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యే అవకాశమున్నందున ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని సూచించారు. కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు.
దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి మీర్‌చౌక్ నుంచి వచ్చేవారికి ముఫీద్ ఉల్ అనామ్ స్కూల్ గ్రౌండ్, సర్దార్ మహల్ రోడ్ వద్ద, షా అలీ బండ నుంచి వచ్చే వారికి చార్మినార్ బస్ టర్మినల్, యునాని ఆసుపత్రి వద్ద, నయాపూల్ నుంచి వచ్చేవారికి ఎస్‌వైజే కాంప్లెక్స్‌తో పాటు ఆదివారం ఒక్కరోజు కాలీ కమాన్ గర్ల్స్ స్కూల్ సమీపంలో వాహనాలను పార్క్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పురానాపూల్, బేగంబజార్ వైపు వారికి ఎంజే బ్రిడ్జ్, సిటీ కాలేజ్, హుస్సేనీ ఆలం వైపు వారికి న్యూ ముర్గీ చౌక్ ఖిల్వత్ రోడ్, ఝలుఖానా లాడ్‌బజార్, ఖిల్వత్ గ్రౌండ్ దగ్గరలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

