Gold scheme | గోల్డ్‌స్కీమ్ పేరుతో రూ.4 కోట్లు వసూళ్లు.. బిచాణా ఎత్తేసిన ముగ్గురు స్నేహితులు
Gold scheme | తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్‌లో కేసు నమోదయింది.
సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. విశాల్, వినయ్, అఖిల్ స్నేహితులు. తక్కువ ధరకు బంగారం ఇప్సిప్తామంటూ గోల్డ్స్కీమ్ను(Gold scheme) తయారు చేశారు. తమ స్కీమ్‌లో రూ.50 వేలతో చేరితో బంగారం మార్కెట్ రేట్ కంటే 10 శాతం తక్కువకు వస్తుందంటూ మొదట విశాల్ వాళ్ల దగ్గరి బంధువులను నమ్మించి డిపాజిట్లు సేకరించాడు.
ఆ తరువాత దీనిని చైన్ సిస్టమ్‌లా మార్చేశారు. మొదటి గోల్డ్‌స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు మీరు పెట్టిన పెట్టుబడితో గోల్డ్ కొన్నాం. దానిని తిరిగి మార్కెట్లో విక్రయించడంతో కొంత లాభం వచ్చిందంటూ నమ్మిస్తూ కొన్ని డబ్బులు తిరిగి ఇచ్చారు. దీంతో చాలా మంది వీళ్ల స్కీమ్‌లో చేరారు.
అయితే వీళ్లు డబ్బులు వసూలు చేసి విలాసవంతమైన జీవితం గడుపుతూ తామంతా బంగారం వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చారు. ఇలా రూ.4 కోట్లు వరకు వసూలు చేసి పరారయ్యారు. ఈ మోసంపై రామంతాపూర్‌కు చెందిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

