బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో పాల్గొని తన అందచందాలతో యువతను ఫిదా చేసిన బబ్లీ బ్యూటీ దివి.సొట్టబుగ్గలతో చిలిపిగా నవ్వుతూ యువతకు బాణాలు సంధించే ఈ అమ్మడు మోడల్‌గా కొనసాగుతూ అడపాదడపా సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషిస్తుంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర పోషించిన కూడా మంచి పేరే తెచ్చుకుంది.
బిగ్ బాస్ 4 కార్యక్రమం ముగిసాక దివికి ఆఫర్లు వెల్లవలా వస్తున్నాయి.చిరంజీవి, నాగార్జున సినిమాలలో చిన్న చిన్న పాత్రలు దక్కించుకున్న దివి కథానాయికగాను పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక అడపాదడపా ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ను కవ్విస్తుంది. తాజాగా పసుపు రంగు చీరలో కసిగా చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.