హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు(Thieves) లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.1,5000 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న లారీని గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే అడ్డగించిన దోపిడి దొంగలు కత్తులతో బెదిరించి నగదును దోచుకున్నారు. లారీ డ్రైవర్ రమేష్, రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.