Hyderabad | పంచాయతీ నేతలకు పదవీగండం.. తలపట్టుకుంటున్న విలీన గ్రామాల నేతలు
హైదరాబాద్ శివారు గ్రామాల విలీన ప్రక్రియ అన్ని పార్టీల నేతలను, కార్యకర్తలను కలవరపెతున్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసినవారే కాకుండా ఈసారి చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కానీ విలీనం వారి కలలను కల్లలు చేసింది.
- సర్పంచ్ నుంచి జడ్పీచైర్మన్ వరకు అన్నింటికీ దూరం
- వందలకొద్దీ తగ్గిన పదవులు.. అంధకారంలో రాజకీయ భవిష్యత్తు
- విలీనంతో భారీగా పెరుగనున్న రాజకీయ నిరుద్యోగం
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/సంగారెడ్డి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు గ్రామాల విలీన ప్రక్రియ అన్ని పార్టీల నేతలను, కార్యకర్తలను కలవరపెతున్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసినవారే కాకుండా ఈసారి చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కానీ విలీనం వారి కలలను కల్లలు చేసింది. అన్ని వార్డుల్లో కార్యకర్తలు, నాయకులు వారి పార్టీల కోసం కష్టపడుతూ, కోరుకున్న పదవుల్లో గెలవడానికి సన్నద్ధమయ్యారు. ప్రధానంగా పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. విలీన ప్రక్రియ వారి ఆశలపై నీళ్లు చల్లింది.
మహానగరం పేరుతో ఆశలకు గండి
ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. జనవరిలో మున్సిపాలిటీల పాలన పూర్తవుతుంది. మరో ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలనతో నడిపించి గ్రేటర్ పాలకవర్గం కాలపరిమితి ముగిసిన తర్వాత కార్పొరేషన్లో కలిపేసి ఎన్నికలకు సిద్ధం అవుతారన్న ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం 150 డివిజన్లు కలిపి కోటి జనాభాతో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన గ్రామాలకు సంబంధించి ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో 60 లక్షల జనాభా నివాసం ఉంటోంది.
వీటన్నింటినీ కలిపి హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే మొత్తం జనాభా 1.8 నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ నిర్ణయం మేరకు సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే కౌన్సిలర్లు, చైర్మన్లు, డైరెక్టర్ల పదవులన్నీ కనుమరుగవుతాయి. వాటిస్థానంలో కార్పొరేటర్లు, మేయర్లు పాలనలోకి వస్తారు. దీంతో నేతల తలరాతలు మారనున్నాయి. ప్రస్తుతం 1200 ఓటర్లతో ఒక మున్సిపల్ వార్డ్, 300 ఓటర్లతో గ్రామ పంచాయతీ వార్డులు ఉండగా కార్పొరేషన్ ఏర్పాటైతే ఒక్కో డివిజన్ పరిధిలో సుమారు 30వేల నుంచి 40వేల మంది ఓటర్లు ఉండే అవకాశముంది.
పోటీకి తయారై.. ఆశలు గల్లంతై..
ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ విలీనప్రక్రియలో భాగంగా పటాన్చెరు సెగ్మెంట్లోని పదకొండు గ్రామాలను తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల్లో కలిపింది. పటాన్చెరు, అమీన్పూర్ మండలాల పరిధిలో దాదాపు 200 మంది లీడర్లు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్సీటీసీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. గ్రామాల విలీన ప్రక్రియ ఈ నేతల ఆశలపై నీళ్లుచల్లింది. మేడ్చల్ జిల్లాలో 28 గ్రామాలు విలీనమైతే.. అందులో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్స్ కలిపి మొత్తం 270 పదవులు ఉండేవి. ఇప్పుడు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత విలీన గ్రామాలకు 130 కౌన్సిలర్లు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అంటే కనీసం వంద పదవులు తగ్గిపోతాయి. ఇవి కూడా ప్రతిపాదిత సంఖ్య. కానీ ఆ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైతే కార్పొరేటర్లుగా మారి ఈ సంఖ్య కూడా మరింత తగ్గే అవకాశముంటుంది. దీంతో పదవులు మరిన్ని తగ్గిపోతాయి. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విలీనమైన గ్రామాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఇప్పటివరకు ఎవరైతే చోటానేతలుగా ప్రజలతో దగ్గరగా ఉన్నారో వారంతా డమ్మీలుగా మారాల్సిందే. పదిమందిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది తప్ప ఇన్నాళ్లూ చేసిన చాకిరీ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
ముగిసిన పదవీకాలం
సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తోనే ముగిసింది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పదవులను ఆశించిన నేతల కలలు కల్లలయ్యాయి. అంతేకాదు ఆయా పంచాయతీలకు చెందిన నేతలు జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. వీటితోపాటు పీఏసీఎస్ సభ్యులు, చైర్మన్, రైతు సమన్వయ సమితి, మండల అధ్యక్షుడి పదవులనూ రాజకీయనేతలు కోల్పోతారు. జిల్లాస్థాయిలో ఉండే జడ్పీచైర్మన్, వైస్‌చైర్మన్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ పదవులకు విలీన గ్రామనేతలు పోటీ పడే అవకాశాలు కూడా లేవు. దీంతో నేతల భవిష్యత్ అంధకారంలో పడింది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

