కొత్త ఏడాదిలోనే కూల్చివేతలు
ఓల్డ్ సిటీ మెట్రో కూల్చివేతలు కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతుండగా, రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా హెచ్ఎంఆర్ఎల్ పెట్టుకున్నది. ఇప్పటికే కొంత మంది యజమానులకు పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా... జనవరి రెండు, లేదా మూడో వారంలో తొలి దశ కూల్చివేతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
- ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ప్రక్రియ వేగవంతం
- మిగిలిన 500 ఆస్తుల సేకరణపై కార్యాచరణ
సిటీబ్యూరో: ఓల్డ్ సిటీ మెట్రో కూల్చివేతలు కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతుండగా, రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా హెచ్ఎంఆర్ఎల్ పెట్టుకున్నది. ఇప్పటికే కొంత మంది యజమానులకు పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా… జనవరి రెండు, లేదా మూడో వారంలో తొలి దశ కూల్చివేతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
7.5కిలోమీటర్ల పొడువైన మెట్రో..
ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణపై హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల పొడువైన మెట్రోను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయాణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్-2లో ఇదీ మొదటి కారిడార్ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఇందులోనూ 400 ఆస్తులకు డిక్లరేషన్ పూర్తి చేయగా, ఇందులో 200 ఆస్తులకు పరిహారం అందించనుండగా, మరో 200 ప్రాపర్టీ ఓనర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన్లోకి రాని 300 ఆస్తుల సేకరణపై దృష్టి పెట్టారు. మొదటి దశ ఆస్తుల పరిహారానికి చెల్లింపులు మొదలైతే గనుక… ప్రక్రియ వేగం పుంజుకుంటుందని, స్వచ్ఛందంగా యజమానులు కూడా ఆస్తులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సేకరణకు సానుకూలంగా ఉన్న పలువురు యజమానులు మెట్రో వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కొత్త ఏడాదిలో కూల్చివేతలు..
ఓల్డ్ సిటీ మెట్రో పనులు కొత్త ఏడాదిలో వేగం పుంజుకోనున్నది. జనవరి మొదటి వారంలోనే పరిహారం చెల్లింపులతోపాటు, కూల్చివేతల పనులు మొదలు కానున్నాయి. మెట్రో వల్ల రోడ్డు విస్తరణ ప్రభావితం అవుతున్న వారసత్వ, మతపరమైన కట్టడాలకు నష్టం లేకుండా ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓల్డ్ సిటీ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగనున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

