సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్‌ను డెవలప్ చేయనున్నారు. ఉమ్టా ఆధ్వర్యంలో ఈ నిధిని సమీకరించనున్నారు. కాగా, ఉమ్టా ప్రతిపాదనల ప్రకారం నగరంలో కొత్త పన్ను విధానం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నగరంలో నిత్యం 3-4వేల వాహనాలు కొత్తగా విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రభుత్వానికి రిజిస్టేష్రన్ ఫీజు వస్తోంది. ఈ చార్జీల్లో కొంత మొత్తాన్ని యూటీఎఫ్‌కు కేటాయించాలనే ప్రతిపాదనలు చేస్తారా? లేక హెచ్ఎండీఏ పరిధిలో 1.25శాతం వసూలు చేసే బిల్డింగ్ డెవలప్మెంట్ చార్జీల రూపంలో వసూలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం నగరంలో కొత్తగా పన్ను వసూలు చేసి, హెచ్ఎండీఏ పరిధిలో రవాణా సదుపాయాలపై దృష్టిపెడతారా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే గనుక జరిగితే నగరంలో ట్రాన్స్‌పోర్టు ప్రణాళికలను ప్రభుత్వ ప్రమేయం లేకుండానే నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.