Homeguard | బంజారాహిల్స్‌లో పార్క్ చేసిన కారును కొట్టేసిన హోంగార్డు.. అరెస్ట్
ఆరునెలలుగా రోడ్డుపక్కన పార్క్ చేసిన కారును తస్కరించిన ఓ ట్రాఫిక్ హోంగార్డు కటకటాలపాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నం. 12లోని ఎన్బీటీనగర్లో ఉంటున్న కాలవకూరి లోకేశ్ సింగ్ ఓ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
Homeguard | బంజారాహిల్స్, జనవరి 29: ఆరునెలలుగా రోడ్డుపక్కన పార్క్ చేసిన కారును తస్కరించిన ఓ ట్రాఫిక్ హోంగార్డు కటకటాలపాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నం. 12లోని ఎన్బీటీనగర్లో ఉంటున్న కాలవకూరి లోకేశ్ సింగ్ ఓ సంస్థలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడి యజమాని హరిదీప్ సింగ్‌కు చెందిన కారు కొంతకాలంగా లోకేశ్ వద్దే ఉన్నది. బస్తీలో తన ఇంటివద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయం సమీపంలో ఆరునెలలుగా పార్క్ చేస్తున్నాడు. అయితే కారును తొలగించాలని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు చెప్పడంతో సమీపంలోని షరోన్ చర్చి ముందు ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి పెట్టారు.
ఆ సమయంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అసిఫ్‌నగర్ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఠాకూర్ నితేశ్సింగ్కు ఆ కారుపై కన్నుపడింది. ఆరునెలలుగా కారు ఇక్కడే ఉంటోందని, ఎవరూ రావడం లేదని స్థానికులు చెప్పడంతో తస్కరించాలని ప్లాన్ వేశాడు. టోయింగ్ వాహనంతో ఆసిఫ్‌నగర్‌లోని తన స్నేహితుడి ఇంటి వద్దకు తరలించాడు. సర్వీసింగ్ చేయించడంతో పాటు దర్జాగా అదే కారులో నగరంలో షికార్లు కొడుతున్నాడు. కారు కనిపించడం లేదని లోకేశ్ ఈ నెల 25న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నితేశ్సింగ్ను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

