సిటీ బ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ):దుర్గం చెరువు డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిషరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన దుర్గంచెరువును పరిశీలించారు. మురుగునీటి పైప్‌లైన్ మళ్లింపు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సివరేజ్ లైన్ స్వతహాగా నిర్వహించి వాకర్స్‌కు ఇబ్బందులు లేకుండా జలమండలి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు పారులో వస్తువులను సమీకరించాలని సీఎస్ఆర్ నిర్వహిస్తున్న వారికి సూచించారు.
అకడ ఉన్న ఎస్టీపీపీ సందర్శించి శుద్ధి వ్యవస్థను అడిగి తెలుసుకున్నారు. థర్డ్ పార్టీతో పాటు నీరి సంస్థ ద్వారా శుద్ధి చేసిన నీటిని పరీక్షించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ ద్వారా చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించి సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.కమిషనర్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సహదేవ్ కేశవ్ పాటిల్, ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వర రావు, జలమండలి అధికారులు, లేక్స్ ఈఈ నారాయణ, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
వీధిలైట్ల సమస్యలపై దృష్టి పెట్టాలి
వీధి లైట్ల సమస్యలను వెంటనే పరిషరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గతంలో చేపట్టిన నాలా పూడికతీత పనుల్లో ఆశించిన ప్రగతి లేనందున.. హైడ్రా సమన్వయంతో మరోమారు పరిశీలించి పూడికతీత పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్లను కర్ణన్ కమిషనర్ ఆదేశించారు.
గురువారం.. అడిషనల్, జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలతో డీసిల్టింగ్, శానిటేషన్, స్ట్రీట్ లైట్, దోమల నివారణ, ట్యాక్స్ వసూళ్లపై కమిషనర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ట్రీట్ లైట్ సమస్యలపై తరచుగా ఎకువ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిషారం పై దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యం మేరకు ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.