పటాకుల దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి
దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాతాలికంగా పటాకుల విక్రయాలు చేపట్టాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు.
- 7లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాతాలికంగా పటాకుల విక్రయాలు చేపట్టాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. పేలుడు పదార్థాల చట్టం- 1884, నిబంధనలు- 1983 (2008 సవరణ) ప్రకారం సంబంధిత జోన్ల డీసీపీ నుంచి లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.
లైసెన్స్ లేకుండా పటాకుల విక్రయాలు చేపడితే చట్టప్రకారం జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాతాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యాపారులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను సైబరాబాద్ పోలీసుల అధికారిక వెబ్ సైట్ www.cyberabadpolice. gov.in,http://www.cyberabadpolice.gov.in లేదా cybpms.telangana.gov.in ద్వారా నవంబర్ 7లోగా సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

