విభిన్న మతాలకు తెలంగాణ నెలవు
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
- చరిత్రను వక్రీకరిస్తే.. కొత్త చరిత్ర బృందం తిరగ రాస్తుంది
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వల్లో మనం, గమ్యం, గమనం’ చరిత్ర సదస్సు కార్యక్రమానికి పలువురు వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ చరిత్ర మహోజ్వలమైందని శాతవాహనుల నుంచి నిజాం పాలకుల వరకు జరిగిన సుదీర్ఘమైన చరిత్రలో ఏ రాజ్యంలో కూడా మత ఘర్షణలు జరగలేదని పేరొన్నారు. రాజులు ఏ మతస్తులైనా ఏ మతాన్ని అభిమానించిన అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిచ్చి సమానత్వాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో విభిన్న మతాలు విలసిల్లిన పీఠభూమిగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నదని అన్నారు.
వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒక మతానికి వ్యతిరేకంగా ఒక కులానికి వ్యతిరేకంగా జరిగింది కాదని స్పష్టం చేశారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన మహోజ్వల పోరాటాన్ని మతకోణంలో విభజించి చూపడానికి జరుగుతున్న కుట్రలను చరిత్రకారులే ఖండించి వాస్తవాలను సమాజానికి తెలియజేయాలని కోరారు. 1929లోనే గాంధీజీ నగరంలోని వివేకవర్ధని సూల్లో మాట్లాడుతూ.. తెలంగాణ నేల గంగా జమున తెహజీబ్ సంస్కృతికి నిలువుటద్దమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. నిజాం రాష్ట్రంలో కొనసాగుతున్న మతసామరస్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గాంధీ ఉద్ఘాటించారని జూలూరు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మత సామరస్యం పరిఢవిల్లుతూనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీనోట్ ప్రసంగాన్ని సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ అలోక్ పరాసేన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు ఈమని శివనాగిరెడ్డి, బండి మురళీధర్‌రెడ్డి, వారసత్వ శాఖ విశ్రాంత అధికారి ఎస్ఎస్ రంగాచార్యులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కోకన్వీనర్లు వేముగంటి మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్, బీవీ భద్రగిరీశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ ఎక్స్‌పోలు
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుచొని నెక్లెస్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీశ్ శాఖ ఆధ్వర్యంలో ఆ వివిధ భాగాలు వినియోగిస్తున్న టెక్నాలజీ, ఆయుధాలు తదితర అంశాలపై పోలీస్ ఎక్స్పో నిర్వహించారు. పోలీస్ విభాగంతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖ, ఫోరెన్సిక్ సైంటిస్ట్ విభాగాలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. హోంమంత్రి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ తదితర అధికారులు ఒక్కో స్టాల్ వద్దకు వెళ్లి ఆ ప్రదర్శనల గూర్చి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనలకు పలు పాఠశాలల విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సైబర్‌క్రైమ్స్, షీ టీమ్స్, ట్రాఫిక్, స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఐడీ, ఇంటలీజెన్స్, రవాణా, క్లూస్ టీమ్ తదితర విభాగాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖలో వచ్చిన కొత్త వాహనాలు, కొత్త టెక్నాలజీ గూర్చి ఆ శాఖ అధికారులు వివరించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరోలు కూడా తమ టెక్నాలజీని ఈ ప్రదర్శనలు ఉంచారు.
ఆకట్టుకున్న పోలీసుల నృత్యాలు
పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉంటున్న అంశాలను పాటరూపంలో ప్రదర్శించారు. దాంతో పాటు స్పెషల్ పోలీస్ విభాగాలలో నైపుణ్యమున్న టీమ్‌ల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. వివిధ రకాలైన బ్యాండ్లకు సంబంధించిన ప్రదర్శన నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

