సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : హెల్త్‌టెక్ రంగంలో(Healthtech) స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడ్ట్రానిక్తో(Medtronic) టీ హబ్(T-Hub) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉండడంతో.. ఈ ఒప్పందం ద్వారా ఆ రంగంలో మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ చర్యలు చేపట్టిందని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.