శంషాబాద్ రూరల్ : ఫైనాన్సియర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద నివాసముండె సాయికృష్ణ (22) ఇటీవల ఓ ద్విచక్ర వాహానం కోనుగోలు చేశాడు.
అయితే నెలనెల డబ్బులు చెల్లించకపోవడంతో సదరు ఫైనాన్స్ వ్యాపారులు ఇంటికి వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. రెండు రోజులలో డబ్బులు పూర్తిగా చెల్లిస్తానని చెప్పినా వినకుండా సీజ్ చేయడంతో కలత చెందిన సదరు యువకుడు ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందారు.
దీంతో మంగళవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫైనాన్స్ వ్యాపారులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.