సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను ఇంటింటికీ వెళ్లి సేకరించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలో ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ఒక్కొక్కటి 500 టన్నుల సామర్థ్యంతో సీ అండ్ డీ (కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషస్) ప్లాంట్లను ఏర్పాటు చేయగా..తాజాగా శంషాబాద్, తూంకుంటలో ప్లాంట్లను 500 టన్నుల కెపాసిటీ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజు వారీగా 2వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం రోజు వారీ లక్ష్యాన్ని ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాల సేకరణ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా నగరంలో నలువైపులా నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్క సర్కిల్‌కు 2-6 టన్నుల కెపాసిటీతో రెండు చిన్న వాహనాలను, మరో 16-25 టన్ను కెపాసిటీతో పెద్ద వాహనాలను ఏర్పాటు చేశారు. వ్యర్థాల తరలింపునకు సర్కిళ్ల వారీగా టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రిక్ టన్నుకు సంబంధిత యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్వయంగా ప్లాంట్ వద్దకు తరలిస్తే తక్కువ యూజర్ చార్జీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
అనుమతి లేని చోట వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు
పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ హైదరాబాద్‌కు కృషి చేస్తున్న జీహెచ్ఎంసీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని అధికారులు కోరారు. భవన నిర్మాణ వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్లకు తరలించాలని, ప్రజలు ఇబ్బందులు కలిగేలా అనుమతి లేని ప్రదేశాలలో వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్లాంట్ల వారీగా యూజర్ చార్జీలు
జీడిమెట్ల కలెక్షన్ ఏరియా కేటాయించిన 8 సరిల్ వివరాలు : యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్సీపురం, పటాన్చెరు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం మొత్తం 8 సరిళ్ల పరిధిలో సేకరిస్తారు. ఇందులో టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159లో, వాట్సాప్ నంబరు 9100927073లో సంప్రదించవచ్చు. ఏజెన్సీ : హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (రాంకీ ఎన్వీరో ఇంజనీర్స్ లిమిటెడ్)
మెట్రిక్ టన్నుకు రూ. 398.50లు, యూజర్ చార్జీలు రూ. 99.62లు అదనం
ఫతుల్లగూడ కలెక్షన్ ఏరియా : ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, మలక్ పేట్, సంతోష్‌నగర్, అంబర్ పేట్ 7 సరిళ్లలో సేకరిస్తారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159, వాట్సాప్ నంబరు 9100927073లో సంప్రదించాల్సి ఉంటుంది. ఎజెన్సీ హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (రాంకీ ఎన్వీరో ఇంజనీర్స్ లిమిటెడ్)
మెట్రిక్ టన్నుకు రూ. 388.75లు, యూజర్ చార్జీలు రూ. 97.20లు అదనం
సాతంరాయి విలేజ్ శంషాబాద్ కలెక్షన్స్ ఏరియా కేటాయించిన 8 సరిళ్ల వివరాలు: చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ (టోల్ ఫ్రీ నంబర్ 1800 203 0033, వాట్సాప్ నంబరు 7330000203లో సంప్రదించాలి. ఏజెన్సీ : సోమ శ్రీనివాస్ రెడ్డి,
మెట్రిక్ టన్నుకు రూ. 405.00లు, యూజర్ చార్జీలు రూ.101.25లు అదనం
శామీర్ పేట్ మండలం తూముకుంట కలెక్షన్ ఏరియా 7 సరిళ్ల వివరాలు: కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మలాజ్ గిరి, సికింద్రాబాద్, బేగంపేట్ (టోల్ ఫ్రీ నంబర్ 1800 203 0033, వాట్సాప్ నంబరు 7330000203లో సంప్రదించాలి. ఏజెన్సీ -సోమ శ్రీనివాస్ రెడ్డి
మెట్రిక్ టన్నుకు రూ. 435.00లు, యూజర్ చార్జీలు రూ.108.75లు అదనం .