వీధి కుక్కల నియంత్రణకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా నగరంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. పలువురు జంతు ప్రేమికులు శునకాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 30 సర్కిళ్లలో వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నదని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. వీధి కుకల నుంచి ప్రజలను సంరక్షించేందుకు బల్దియా అన్ని జోన్లలో సరిల్ వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్ జోన్ మలాజ్గిరి సరిల్ నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాశ్ ఆసక్తి ఉన్న ఎన్జీవోలకు వీధి కుకలను అందించారు. చార్మినార్ జోన్లో వీధి కుకపిల్లల దత్తత కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, జాయింట్ కమిషనర్ శైలజ, డిప్యూటీ కమిషనర్లు సూర్య కుమార్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.