బంజారాహిల్స్, ఫిబ్రవరి 25 : జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 1నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తొమ్మిది రోజుల పాటు ఉదయం 8 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 9గంటల వరకు వివిధ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.