బీజేఆర్నగర్ బస్తీ సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే దానం
ఎమ్మెల్యే దానం | ఫిలింనగర్‌లోని బీజేఆర్నగర్ బస్తీలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.

బంజారాహిల్స్,సెప్టెంబర్ 8 : ఫిలింనగర్‌లోని బీజేఆర్నగర్ బస్తీలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. బీజేఆర్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు, బస్తీనాయకులు బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
బస్తీలో బాబూ జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీహాల్ నిర్మించాలని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపట్టాలని కోరారు. బస్తీలో ఓపెన్నాలాపై శ్లాబ్ వేయించాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బస్తీలలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, జీహెచ్ఎంసీ సిబ్బంది సరైన స్పందన చూపడం లేదని ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా కారణంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడ్డాయని, త్వరలోనే అన్ని పనులను పూర్తిచేయించే బాద్యత తనదే అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీజేఆర్నగర్ బస్తీ నేతలు నడిమింటి కృష్ణ, బి.దామోదర్, డి.ఎల్లయ్య, చంద్రశేఖర్, యాదయ్య, కోట రాములమ్మ, భాగ్యమ్మ, విజయలక్ష్మి తదితరులున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

