నాలా పనులు 75శాతం పూర్తి
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
- మొదటి విడత ప్యాకేజీ డిసెంబరు కల్లా సంపూర్ణం
- పనులకు నిధుల కొరత లేదు.. చెల్లింపుల్లో జాప్యం లేదు
- పలు ప్రాంతాల్లో తప్పిన వరద ముప్పు
- ఎస్‌ఎన్‌డీపీపై జీహెచ్ఎంసీ స్పష్టత
సిటీబ్యూరో, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.
పనులు ప్రగతి దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు రూ. 450 కోట్ల విలువ గల బిల్లులు చెల్లింపులకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.103.19 కోట్ల విలువ గల బిల్లులు చెల్లించామని, మిగతా సుమారు రూ. 350 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ప్రాసెస్‌లో ఉన్నట్లు చెప్పారు. వాటిని కూడా త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ సోమవారం స్పష్టం చేసింది.
నాలా పనులను ముందుగా మిషన్‌మోడ్‌లో అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, ఎడతెరపి లేని వర్షాలు పడటం మూలంగా కొంత ఆలస్యమైందని అన్నారు. అయినప్పటికీ చేపట్టిన నాలా పనుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం లేకుండా చేశామని చెప్పారు. ఈ సారి భారీ వర్షాలు కురిసినా పలు ప్రాంతాల్లో ముంపుముప్పు తప్పిందని తెలిపారు. అక్టోబర్‌లో 75 శాతం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, మొత్తం పనులను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- bill
- GHMC
- Hyderabad
- Nala works
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

