కొంపముంచిన స్మార్ట్‌ఫోన్ వ్యసనం.. 20 ఏండ్ల యువకుడిపై 4 సెక్షన్ల కింద కేసు
స్మార్ట్‌ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్లాష్ అప్డేట్కు ప్రభావితమై అలాంటిదే తాను చేయాలన్న ఆలోచన అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది..
స్మార్ట్‌ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్లాష్ అప్డేట్కు ప్రభావితమై అలాంటిదే తాను చేయాలన్న ఆలోచన అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.. ఇటు రైల్వే పోలీసులు, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చివరికి ఆ యువకుడిపై 4 ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టించింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లిలో ఉంటున్న కార్తిక్(20) ప్రైవేటు ఉద్యోగి. బుధవారం ఖాళీ సమయంలో అతడు తన స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ చానెల్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అతడికి బాంబుకు సంబంధించి ఓ ఫ్లాష్ అప్డేట్ వచ్చింది. తాను ఏదో ఒకటి చేసి ఫ్లాష్ న్యూస్‌కు కారణం కావాలనుకున్నాడు. ఆ అప్డేట్కు ప్రభావితమై వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. రైలులో బాంబు ఉన్నదని చెప్పాడు.
అప్రత్తమైన పోలీసులు వెంటనే రైల్వే అధికారులను అలర్ట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లిలో ఆపి మూడు గంటల పాటు తనిఖీ చేశారు. ఏ ప్రమాదకర వస్తువూ లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డయల్ 100కు వచ్చిన నంబరును ఆరా తీయడంతో కార్తిక్ వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు అతడిపై ఐపీఎసీ 182 (ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం), 186 (ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం), 505 (వదంతులు సృష్టించి గందరగోళ వాతావరణం సృష్టించడం), 507 (కుట్ర పూరితంగా, వివరాలను దాచి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం) కింద కేసులు నమోదు చేశారు.
ఫోన్ ఫోబియా మంచిది కాదు..
స్మార్ట్‌ఫోన్‌లో తేలుతూ వాస్తవాన్ని మరిచి చేసిన ఓ చిన్న తప్పుకు కార్తిక్ పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. ఫోన్ ఫోబియా మంచిదికాదని, ఎంత ప్రమాదమో అందరూ తెలుసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ప్రధానంగా పిల్లలు, యువత ఈ ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

