Rain | హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరుజల్లులు..
హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరుజల్లులు (Rain) కురిశాయి. సోమవారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్, నాంపల్లి, లకిడీకపూల్, ఖైరతాబాద్‌తోపాటు పటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరుజల్లులు (Rain) కురిశాయి. సోమవారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్, నాంపల్లి, లకిడీకపూల్, ఖైరతాబాద్‌తోపాటు పటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం చల్లబడింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, ద్రోణి ప్రభావంతో చల్లబడిన నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.7 డిగ్రీలు, గాలిలో తేమ 46 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

