హైదరాబాద్‌కు డ్రగ్స్..
ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వనస్థలిపురం, భువనగిరి పోలీసులతో కలిసి రెండు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన అత్తాపురం భరత్‌రెడ్డి విద్యార్థి.
- రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురి అరెస్టు
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వనస్థలిపురం, భువనగిరి పోలీసులతో కలిసి రెండు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన అత్తాపురం భరత్‌రెడ్డి విద్యార్థి. మొదట డ్రగ్స్ అలవాటు చేసుకొని.. ఆ తరువాత డ్రగ్ విక్రేతగా మారాడు. వనస్థలిపురం నివాసి చిక్యాల విఖ్యాత్ కూడా విద్యార్థి. డ్రగ్ విక్రేతగా మారాడు. వీరిద్దరూ స్నేహితులు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు మంచి గిరాకీ ఉన్న విషయాన్ని గుర్తించి.. బెంగళూర్ నుంచి డ్రగ్స్ తేవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూర్‌కు వెళ్లి రూ.1,200 గ్రాము చొప్పన డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు గ్రాము చొప్పున విక్రయించేందుకు ప్లాన్ చేశారు. బెంగళూర్‌లో 26 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ కొని, 16వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. 17వ తేదీ రాత్రి 11.20 నిమిషాల సమయంలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం రావడంతో డ్రగ్స్ విక్రేతలైన ఇద్దరు స్నేహితులతో పాటు డ్రగ్ వినియోగదారుడు తన్నీర్ హేమంత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 26 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్‌రెడ్డిపై గతంలో పలు ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి.
హాషిష్ ఆయిల్ పట్టివేత..
బోరబండకు చెందిన దినేశ్ కారు మెకానిక్. అమృతలూరి హానెస్ట్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. తాళ్లపల్లి భరణి ప్రైవేట్ ఉద్యోగి. ఈ ముగ్గురు స్నేహితులు. విశాఖపట్టణం పరిధిలోని నర్సిపట్నంలో తక్కువ ధరకు హాషిష్ (గంజాయి) ఆయిల్‌ను కొనుగోలుచేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. లీటర్‌కు రూ. 50 వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చారు. 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి సర్కిల్ పోలీసుల సహకారంతో అనాజిపురం క్రాస్ రోడ్డులో ముగ్గురు నిందితులతో పాటు రూ.20 లక్షల విలువైన 2 లీటర్ల హాషిష్ ఆయిల్, ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 2,500 నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

