సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలి
సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు.
- సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
సికింద్రాబాద్/అడ్డగుట్ట, జనవరి 13: సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజా సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్ చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ ,టకారాబస్తీలోని ఆయన నివాసంలో పద్మారావుగౌడ్ ప్రారంభించారు. అదేవిధంగా పతంగులను ఎగుర వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సుంకు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
పతంగులను ఎగరేసిన మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
కంటోన్మెంట్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బోయిన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పతంగుల వేడుకల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి : జంపన
చిన్నారులు, యువత పతంగులను ఎగురవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లి పరిధిలోని బాపూజీనగర్, సంజీవయ్యకాలనీ, చిన్న తోకట్ట, కంసారి బజార్‌తోపాటు పలు ప్రాంతాల్లో చిన్నారులకు జంపన ప్రతాప్ పతంగులు పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యుత్‌వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉండే చోట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

