మారేడ్‌పల్లి, జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మారేడ్‌పల్లి షెనాయ్ క్రీడా మైదానంలో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కంటోన్మెంట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బస్తీ, కాలనీకి చెందిన మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంక్రాంతి పర్వదినాన్ని వివరిస్తూ మహిళలు వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి. మహిళలతో సమానంగా మడ్పోర్ట్కు చెందిన అశోక్ ప్రత్యేక బహుమతుని గెలుచుకున్నారు.
ముగ్గుల పోటీల్లో గెలుపోందిన ఐదో వార్డు వాల్మీకినగర్‌కు చెందిన సరితకు మొదటి బహుమతిగా 15 వేలు, రెండో నాలుగోవ వార్డు రాంనగర్‌కు చెందిన హిమబిందుకు రూ. 6 వేలు, మూడో బహుమతిగా బోయిన్‌పల్లికి చెందిన సౌందర్య రూ.5 వేలు, నాలుగో బహుమతిగా మారేడ్‌పల్లికి చెందిన అంజలికి రూ.3 వేల రూపాయాల నగదును ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. సూమారు 100 కు పైగా మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు.
పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహు మతులను అందజేశారు. ముగ్గుల పోటీల న్యా యనిర్ణేతలుగా ఎమ్మెల్యే కుమార్తె నివేధిత, బీఆర్ఎస్ నాయకులు సరితతో పాటు పలువురు మహిళలు ఉన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యురాలు నళిని కిరణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎ స్ నాయకులు పిట్ల నాగేశ్ ముదిరాజ్, ఒదెల అజేయ్, సంతోష్ యాదవ్, చొల్లేటి రమేశ్, పనస సంతోశ్, గంగారాం, సానాది శ్రీనివాస్, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.