హైదరాబాద్ : ఫోర్జరీ సంతకాలతో మోసాలకు పాల్పడుతున్న సాయి సుధాకర్ నాయుడు అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేరీ స్వర్ణ భూమి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొత్తూరులో ఎమ్మెస్సార్ పేరుతో ఇరవై ఎనిమిది ఎకరాల్లో ప్లాట్లు వేయించి సుధాకర్ అమ్మకాలు జరిపాడు. అలాగే మహిళలపై అసభ్య వీడియోలు తీసిన కేసుల్లోనూ సుధాకర్ నిందితుడి ఉన్నాడు. సుధాకర్ పై ఏపీ, తెలంగాణలో 40 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.