Minister Sitakka | రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం : మంత్రి సీతక్క
Minister Sitakka | మహిళల పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిరోధంతో పాటు, మహిళల భద్రత పై తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.
వెంగళరావునగర్ : మహిళల పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు (sexual harassment ) నిరోధంతో పాటు, మహిళల భద్రత పై తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Sitakka) అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమితులైన బండ్రు శోభారాణి పదవీ భాధ్యతలు స్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న వేళ వారిపై దాడులు కూడా జరుగుతున్నాయని అన్నారు. మహిళల భద్రత పై దృష్టి పెడ్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం (Telangana agitation) ఉవ్వెత్తున ఎగిసినప్పుడు శోభారాణి ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని, ప్రజా పోరాటాలు చేసిన శోభారాణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి పదవిని కట్టబెట్టారని అన్నారు.
మహిళాభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.కాంతి వెస్లీ జాయింట్ డైరెక్టర్ సునంద,లక్ష్మీ దేవి,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Read more :
KTR | ఓయూలో జర్నలిస్టు అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
Balka Suman | రేవంత్ రాజ్యంలో అడుగడుగునా అవమానాలు.. ఎస్సీ, బీసీ మంత్రుల పట్ల వివక్షపై బాల్క సుమన్ ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

