Balka Suman | రేవంత్ రాజ్యంలో అడుగడుగునా అవమానాలు.. ఎస్సీ, బీసీ మంత్రుల పట్ల వివక్షపై బాల్క సుమన్ ఆగ్రహం
Balka Suman | రేవంత్ రాజ్యంలో అడుగడుగునా అవమానాలు, అవహేళనలు చోటు చేసుకుంటున్నాయని, ఎస్సీ, బీసీ మంత్రుల పట్ల వివక్ష కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
Balka Suman | హైదరాబాద్ : రేవంత్ రాజ్యంలో అడుగడుగునా అవమానాలు, అవహేళనలు చోటు చేసుకుంటున్నాయని, ఎస్సీ, బీసీ మంత్రుల పట్ల వివక్ష కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మంచిగా చూస్తది. అందరికీ అవకాశాలు ఇస్తదని ముచ్చట్లు చెబుతున్నాడు. కానీ ఆచరణలో రవ్వంత కూడా చూపించడం లేదు. కేబినెట్లోని ఎస్సీ, బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్నపీట వేసి కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపీటల్లో కూర్చున్నారు. అక్కడ ఎస్సీ, బీసీ మంత్రులకు అవమానం జరిగింది. నిన్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా సేమ్ సీన్ రీపిట్ అయిందని బాల్క సుమన్ గుర్తు చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా పొన్నం ప్రభాకర్‌కు అవమానం
హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా అవమానం జరిగింది. అధికారులు రిసీవ్ చేసుకోలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. డివైడర్ మీద కూర్చొని నిరసన తెలిపిన పరిస్థితి. రేవంత్ కేబినెట్లోని ఎస్సీ, బీసీ మంత్రులకు ఉద్దేశపూర్వకంగా అవమానాలు జరుగుతున్నాయి. ఎస్సీ, బీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి. అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణ వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు వార్తలుగా వచ్చాయి. కాంగ్రెస్ ప్రజా పాలనలో, రేవంత్ రాజ్యంలో కుట్ర పూరితమైన విధానం కొనసాగుతోంది అని మండిపడ్డారు.
రేవంత్ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు..
ఇటీవల నియమించిన 35 కార్పొరేషన్లలో సామాజిక న్యాయం లేదు. రేవంత్ పరిపాలనలో ఎక్కడా కూడా సామాజిక సమతూకం అసలే లేకుండా పోయింది. రేవంత్ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. నేను సేవకుడిని అందరికి మంచి పరిపాలన అందిస్తాను, కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ్నేమో నిరుద్యోగులను, విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు ఇదే నిరుద్యోగుల పక్షాన డీఎస్సీ, గ్రూప్-1, టెట్ నిర్వహణ గురించి వీళ్లు మాట్లాడలేదా..? నిరుద్యోగుల సహాకారంతో అధికారంలోకి వచ్చాక వారి నడ్డి మీద తంతున్నారని బాల్క సుమన్ ఆగ్రహం వెలిబుచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

