అబిడ్స్ ఏప్రిల్ 9: అగ్రి హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రైతు మహోత్సవం సేంద్రియ మేల-2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అగ్రి ఆర్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ రవీంద్రబాబు, వీరభద్రరావు, రంగారావు, సూర్యకళ తెలిపారు. ఈ కార్యక్రమం14వ తేదీ వరకు(నాలుగు రోజులపాటు) నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రైతులకు మరిన్ని సేవలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో సాంకేతికత అధిక దిగుబడి వంగడాలు, సేంద్రియ పంటలు, నీటిపారుదల బిందు సేద్యం, పౌల్టీ్ర, పాడి, మత్స్య, చేనేత, వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లు ఆధునిక యంత్ర పరికరాల రంగాలలో పూర్తి సమాచారాన్ని ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసే స్టాల్ల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలోని రైతు సోదరులు, విద్యార్థులు ఈ రైతు మహాసభ కార్యక్రమంలో పాల్గొంటారని వీరికి వివిధ విభాగాల శాస్తవ్రేత్తలు అనేక రకాల మెలుకువలను వివరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో రైతు మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రైతులతో పాటు విద్యార్థులు పాల్గొని శాస్తవ్రేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ప్రతినిధులుఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ ఉపాధ్యక్షులు ఆదిత్య మార్గం, సెక్రటరీ జీవీ రంగారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.