మహత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ పీస్’ కార్యక్రమంలో 10కె, 5కె, 2కె రన్ శనివారం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక చెవెళ్ల ఏంపీ రంజిత్ రెడ్డి, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో పాటు పలువురు వాకర్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు మహత్మాగాంధీ చిత్ర పటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటారు. 10కె, 5కె, 2కె రన్లలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.