బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో సమస్యలను పరిష్కరించేందుకు రూ.3కోట్ల నిధులు మంజూర య్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్, వినాయక్‌నగర్ బస్తీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
బస్తీల్లో మురుగు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు. గౌతమ్‌నగర్ కమ్యూనిటీహాల్లో నిర్వహణ సరిగా లేదని, అర్థరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సాంగ్స్‌తో న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఫిలింనగర్ బస్తీల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు రూ.3కోట్ల నిధులు మంజూరయ్యాయని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సంబంధిత బస్తీల్లో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో పర్యటించిన అనంతరం పనులను ప్రారంభిస్తామన్నారు.
వినాయక్‌నగర్, గౌతమ్‌నగర్ బస్తీల్లో మురుగు సమస్యలను పరిష్కరిస్తామని, గౌతమ్ నగర్ కమ్యూనిటీహాల్లో న్యూసెన్స్ వ్యవహారంపై విచారణ చేయించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నగేష్ సాగర్‌తో పాటు బస్తీ నాయకులు లక్ష్మీనారాయణ, రవి నాయక్, తిరుపతి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.