Rowdy Sheeter | హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడని తెలిసిందే. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా హత్య అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి, పోలీసులు తనను పట్టుకోలేరని నిందితుడు అఫ్రోజ్ ఛాలెంజ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్ పోలీసుల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు నందనవం సూరిపై గతంలో వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తన మొదటి భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అతనిపై నగర బహిష్కరణ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి నందనవనం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడకు చేరుకుని ముందుగా సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మీర్పేట్లో రౌడీషీటర్ సూరి దారుణ హత్య
హత్య అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి, పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరిన నిందితుడు
హైదరాబాద్–మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో రౌడీషీటర్ సూరిని దారుణంగా హతమార్చిన అఫ్రోజ్ అనే వ్యక్తి
గతంలో తన భార్య, బావమరిది… pic.twitter.com/3oMXa9kZ3J
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!