స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థల్లో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు.
చిక్కడపల్లి, మే 31 : రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థల్లో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్(ఎఫ్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ‘ఫీజుల నియంత్రణ చట్టం- అవశ్యకత’ అనే అంశంపై శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎ.నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం ప్రవేశ పెట్టి ఫీజుల నియంత్రణ చేయాలన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ విద్యలో వ్యాపార ధోరణి ప్రమాదకరమన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎ.మూర్తి అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ప్రొఫెసర్ తిరుపతిరావు, ఐఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు పి.నాగరాజు, పుట్టా లక్ష్మణ్, మణికంఠ రెడ్డి, రామకృష్ణ, అశోక్ రెడ్డి, పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

