Renova Hospitals | హైదరాబాద్‌లో విస్తృతంగా సేవలు అందిస్తున్న రెనోవా హాస్పిటల్స్ కొత్తగా మరో కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. మలక్‌పేటలోని బీబీ హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు బీబీ క్యాన్సర్ హాస్పిటల్‌ను అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి.. రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్‌గా ప్రారంభించినట్లుగా రెనోవా యాజమాన్యం ప్రకటించింది.
ఈ సందర్భంగా రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ రెనోవా గ్రూప్‌లో 9వ కేంద్రంగానూ.. ఆంకాలజీలో ఐదో కేంద్రంగా ఉండనుందని తెలిపారు. ప్రజలకు ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం వైపుగా తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే విద్యానగర్‌లో కూడా దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ నుంచి కూడా రెనోవా గ్రూప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.