కాచిగూడ, అక్టోబర్ 21: ఆర్టీసీ బస్సు ఢీకొని ర్యాపిడో వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోషామహల్ ప్రాంతానికి చెందిన జగదీశ్వర్ కుమారుడు జి.శ్యాంసుందర్(41) ర్యాపిడో వాహనం నడుపుతున్నాడు.
సోమవారం ర్యాపిడో వాహనంపై చాదర్‌ఘాట్ నుంచి కాచిగూడకు వస్తుండగా మార్గమధ్య నింబోలిఅడ్డాలో కాచిగూడ నుంచి చాదర్‌ఘాట్‌కు వెళ్తున్న బర్కత్‌పుర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 21 జెడ్ 0050) బైక్‌ను ఢీకొనడంతో శ్యాంసుందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.