‘గ్లామర్’ మాత్రమే..!
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గులకుంటకు చెందిన షేక్ అబ్దుల్లా పాషా రాపిడో డ్రైవర్. డబ్బుల కోసం డూప్లికేట్ తాళాలతో ద్విచక్రవాహనాలను
బైక్ల తస్కరణ.. విడి భాగాలుగా మార్చి విక్రయించేందుకు ప్లాన్
ర్యాపిడో డ్రైవర్ అరెస్టు.. రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గులకుంటకు చెందిన షేక్ అబ్దుల్లా పాషా రాపిడో డ్రైవర్. డబ్బుల కోసం డూప్లికేట్ తాళాలతో ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్నాడు. ఓ బైక్ మెకానిక్ సాయంతో వాటిని విడిభాగాలుగా మార్చి అమ్మేందుకు ప్లాన్ వేసుకున్నాడు.
అబిడ్స్, సైఫాబాద్ పీఎస్ పరిధిలో వాహనాలను ఎత్తుకెళ్లగా, తాజాగా మంగళవారం రాత్రి కూడా ఓ బైక్ను కొట్టేశాడు. దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ బృందం ఫిర్యాదు అందిన 24 గంటల్లో సీసీ కెమెరాల ద్వారా షేక్ అబ్దుల్లా పాషాను గుర్తించి.. పట్టుకుంది. నిందితుడి నుంచి రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

