హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బి.రాజమౌళి ఏసీ గార్డ్స్ లోని సమాచార భవన్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను మెరుగ్గా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు.
రాజమౌళికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది అడిషనల్ డైరెక్టర్స్ నాగయ్య కాంబ్లె, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్స్ జగన్, శ్రీనివాస్, రమణ, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు , జీహెచ్ఎంసీ సీపీఆర్వో మూర్తుజా, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎం. మధుసూదన్, వెంకటేశ్వర్లు, పాండురంగారావు, జీ. ప్రసాదరావు, రాజారెడ్డి,సురేష్ తదితరులు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.