కాచిగూడ : తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి బీసీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అనుచిత వాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్ ఆధ్వర్యంలో కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, రవీందర్‌యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, సునీల్బిడ్లాన్, సదానంద్, బి.కృష్ణాగౌడ్, పెంటం రమేశ్, మన్నె శ్రీనివాసయాదవ్, మహేందర్‌యాదవ్, శ్రీకాంత్‌యాదవ్, సచిన్, సన్నీ, శ్రీశైలం, బబ్లూ, అంటోని, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.