హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్తాపూర్ రాజేంద్రనగర్లో జోరువాన కురుస్తోంది. శేరిలింగంపల్లి,చందానగర్, మియాపూర్, మదీనాగూడలో కూడా వర్షం కురుస్తోంది. వర్షాలకు వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది.