VenkyAnil5 | విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఓ వినూత్న ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాస్యం, సరదా సంభాషణలు, ఆసక్తికరమైన కథా సూచనలతో రూపొందించిన ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆదివారం విడుదలైన ఈ ప్రత్యేక వీడియోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మధ్య సరదా సంభాషణలు కనిపించాయి. పాపం అనిల్‌ను ఇసుకలో పాతేశారట అంటూ వెంకటేష్ సరదాగా మాట్లాడగా, కళ్యాణ్ రామ్ కూడా “పటాస్ సమయంలో బాగానే ఉన్నాడు.. కానీ ‘నేను పాడతా’ అని మీరే ఇలా చేశారంటూ” నవ్వులు పూయించారు.
అంతలోనే హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి భయపడుతూ అక్కడికి పరుగెత్తుకుంటూ రావడం వీడియోలో కనిపించింది. హీరోయిన్ల వెనుక కత్తి పట్టుకుని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇవ్వడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. “కత్తిలాంటి ఐడియాలతో ప్రమోషన్స్ చేస్తున్నానని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టారు” అంటూ అనిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఎప్పుడూ తానే ఐడియాలు ఇవ్వాలా, ఈసారి మీరే ఏదైనా కొత్త ఐడియా చెప్పాలని హీరోలను అడుగుతాడు. దానికి స్పందించిన వెంకటేష్ ‘కత్తిలాంటి ఐడియా’ అంటూ అనిల్ వేలు కోసినట్లు నటిస్తూ రక్తంతో విజయ తిలకం దిద్దుతాడు. తర్వాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కూడా అదే తరహాలో సరదాగా వ్యవహరించడం వీడియోలో వినోదాన్ని పంచింది.
వీడియో చివర్లో సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని అనిల్ రావిపూడి వెల్లడించాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అంటే కేవలం రక్తపాతమే అనుకోవద్దు. మనది పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాడు. దీంతో ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉండనున్నాయని అర్థమవుతోంది. ప్రస్తుతం ‘VenkyAnil5’, ‘NKRAR2’ అనే వర్కింగ్ టైటిళ్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 22 నుంచి ప్రారంభం కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇది ఐదో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు విజయవంతం కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం😂😂😂
Presenting you all the
‘KATHI LANTI IDEA’ from the crazy gang of #VenkyAnil5 #NKRAR2 ❤️🔥SHOOT BEGINS TOMORROW💥
SANKRANTHI 2027 Release ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi… pic.twitter.com/ikaWOpiAiw
— Shine Screens (@Shine_Screens) June 21, 2026