సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 24గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 36.9 డిగ్రీలు, కనిష్ఠం 23.4 డిగ్రీలు, గాలిలో తేమ 35శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.