సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, రుతుపవనాల ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.