Rain Alert | రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. మరో వైపు రాత్రి 8 గంటల నుంచి జంట నగరాల పరిధిలోని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సరూర్‌నగర్, చంపాపేట, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట, చాదర్ఘట్, ఐఎస్ సదన్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో జనం ఒక్కపోతతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.