సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో పాటు ఉపరితల ద్రోణిగా మారింది. దీనికి తోడు 6.7 కిలోమీటర్ల ఎత్తులో షియర్జోన్ ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో గ్రేటర్లో రాగల మూడు రోజుల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి నగరంలో తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. బహుదూర్పురాలోని చందులాల్ బారాదరిలో అత్యధికంగా 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.