హైడ్రా బాధితులకు అండగా నిలుస్తాం
గాజులరామారంలోని హైడ్రా బాధితులకు అండగా నిలుస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ భరోసానిచ్చారు.
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
దుండిగల్, సెప్టెంబర్ 26: గాజులరామారంలోని హైడ్రా బాధితులకు అండగా నిలుస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ భరోసానిచ్చారు. నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం (సర్కిల్) డివిజన్ సర్వేనంబర్ 307లోని గాలిపోచమ్మబస్తీ, బాలయ్యనగర్ బస్తీలోని పేదప్రజల ఇండ్లను ఈనెల 21వ తేదీన హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్ ఆయా బస్తీలల్లో పర్యటించారు. హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వేనంబర్ 307లో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చడం దారుణమన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూల్చివేతలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఆలయ ముఖద్వారానికి శంకుస్థాపన…
గాజులరామారం డివిజన్ మెట్కానిగూడలోని అయ్యప్పకాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప దేవాలయం కాలనీ ముఖద్వారం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వివేకానంద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు సంక్షేమసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

