Assistant Professor | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
Assistant Professor | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
Assistant Professor | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగల్రావు నగర్లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది.
విద్యార్హత, కమ్యునిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు పేర్కొంది. ఈ నెల 22, 23వ తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారు, ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలు కూడా అందజేశారు. మిగిలిన 30 డిపార్ట్మెంట్లలోని 433 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను మంగళవారం విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.
Read Also :
Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Bhuwan Chandra Khanduri | ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి.. సీఎం పుష్కర్ సింగ్ సంతాపం
White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

